Thursday, September 30, 2010

నడక నేర్చుకుంటున్న ఓ నగ్న పాదాల జంట...

అనుభవాల పొదరిళ్ళళ్ళో...
చెదిరిన ఙాపకాలు!!
ఆ ఙాపకాలను దాటుకుంటూ...
గమ్యంతెలియని పయనాన...
బుడిబుడి అడుగులతో...
నడక నేర్చుకుంటున్న ఓ నగ్న పాదాల జంట!!
చేరవలసిన గమ్యమేమో సమాధానం లేని కల్పితం!!
గడిచిన ఆరంభమేమో గుర్తుకురాని గతం!!
ఇక మిగిలినదల్లా మనసునిండుగ తనపై పెట్టుకున్న నమ్మకం!!

నడక ఆరంభించిననాడు...
ఊహాతీతం తన పాదల సౌకుమర్యం!!
ప్రయాణపు బడలికలో...
నిత్య యవ్వనం తనప్రేమ మాధుర్యం!!

ఇప్పుడు..
ఆరంభపు క్షణం అనవసరం..
విడిచిన సుకుమరం అప్రస్తుతం..
తన ప్రేమ ఒక్కటె వాస్తవం!!

No comments:

Post a Comment