Thursday, September 30, 2010

ఆమె వెళ్ళిపోయిన రోజు....

ఆమె వెళ్ళిపోయిన రోజు
నా ముఖాన మసిపూసుకున్నాను
కౄరమైన పిచ్చిగాలి చెంప పగులగొట్టాను
ముక్కలైన జీవితాన్ని చేతికెత్తుకున్నాను
పగిలిన అద్దం ముందు నగ్నంగా నిలిచాను
నా మీద నాకే ఆవేశం
హుందాగా సూర్యుడ్ని "మూర్ఖుడా" అని తిట్టాను
రంగుల లోకపు వైతాళికులకు వెతికివెతికి "థూ" అన్నాను
తూర్పునుండీ పడమరకు చెప్పులులేకుండా నడిచాను
దారిలో పడి ఉన్న కంకరరాళ్ళను మీద చల్లుకున్నాను
విభ్రమ స్ఫూర్తితో కొండకోనల్ని చీల్చిపారే నీటికి
ఏ సముద్రం చేరే కోరికో?
లేదా,మందగతిన ఇసుక ఒడిలో కూరుకుపోయే నిర్వేదమో
నాలోనేను లేనన్నది ప్రశ్న
ఇక ఆమెకళేబరాన్ని అక్కునచేర్చుకుని రోదించేదెట్లా?
ఆమె వెళ్ళిపోయిన రోజు
నా ముఖాన మసిపూసుకున్నాను

నాకు నచ్చిన కవిత... పర్ణశాల నుండి.

http://parnashaala.blogspot.com/2010/03/blog-post_18.html

No comments:

Post a Comment