కధలెప్పుడూ ఒకేలావుంటాయి...
కొన్నేమో జీవితాలనుండి పుట్టుకొచ్చినవి!
మరికొన్నెమో జీవితాలుగా మారబొయ్యేవి!!
కమ్మని కబుర్ల మూటలు...
వెచ్చని ఆశల వూసులు...
కలసిన కన్నుల బాసలు...
వెరసి ప్రేమై... పరిణయానికి పరుగులుతీస్తయి!!
అప్పుడే...
పెద్దరికానికి తన పేరు గుర్తుకువస్తుంది..
పిల్లలపై అనురాగాన్ని విడిచి...
పెద్దరికపు హోదాతో.. తన వొళ్ళు విరుస్తుంది!!
కులమతాల తేడాలు...
సామాజిక బేధాలు...
లెక్కలుకట్టి...
ప్రేమను ముక్కలు చెయ్యడానికి పన్నాగం పన్నుతుంది!!
పెద్దల అక్కసును చూసిన పిల్లలకు...
ప్రేమకు రెక్కలొస్తాయి!!
తమ హక్కులను గుర్తుకుతెస్తాయి!!
వెలుగునీడన కుందేళ్ళలా..
బెదురుకాపురాన ఇరుక్కుంటారు!!
లేనిపొని అపార్ధలతో జీవితాన్ని తెగ నరుక్కుంటారు!!
బతకలేక వీళ్ళో...
బతకనివ్వక వాళ్ళో...
గాలిలోకలుపుతారు ఆయువుతో పాటు ప్రేమను కూడా!!
ఇంతేనా కధ??
ఇలాంటి కధకు కొత్త ముగింపునివ్వాలి...
అందుకు నా కధే ప్రారంభం కావలి!!!
No comments:
Post a Comment