Saturday, February 6, 2010

సదా నీ ప్రేమలో...

ఎపుడైతే నీ రాకకై నా కనులు వీక్షించాయో ...
ఎపుడైతే నీ పలకరింపుతో నా యద పులకరించిందో...
అపుడే తెలిసింది...
నువ్వంటే నా కిష్టమని!
నా యదలో వుంది నీ రూపమని!!

కాని...
నా పెదవి దాటిరాకుంది ఆ మాట!
నీ మదిని చేరకుంది నా బాస!!

ఏదో సంశయం!!
కాదంటవేమోనన్న భయం!!
గుండెనువీడని ఒక అనిర్వచనీయ అనుభవం!!
ఒకటి మాత్రం నిజం...
ఇలాంటి భావమే వస్తంది ఎదోనాడు నీ మదిలో కూడా!!
నాటివరకు వేచివుంటా ప్రియా నీ కొరకై...
ఎన్నాళ్ళైనా...
ఎన్నేళ్ళైనా...
సదా నీ ప్రేమకై తపించే..
నీ మన్ను.యస్

No comments:

Post a Comment