Saturday, February 6, 2010

ఓ సాయం సంధ్యా సమయాన...

చందమామ కలువలను నిద్రనుండి మేల్కొల్పువేళ...
ఉదయభానుని అరుణకిరణాలు తుదిమెరుగులు దిద్దుకుంతున్నవేళ...
పండిన ఎర్రని గోరింటవోలె...
నులివెచ్చని కౌగిలిలో బిగిసిన పడతి మొమువోలె...
ఆకసము రూపుదాల్చువేళ ...
విహగాల సురాగాల తాకిడికి తనువు మధువై పులకించు వేళ...
అరుదైన ఆ సాయం సంధ్యా సమయాన...
ప్రియా.......
బరువెక్కిన శ్వాసతో...
యద నిండా ఆశలతో...
నీ బిగి కౌగిలిలో కరిగిపోవాలని...
ఆకసమంటి నీ విశాల నుదిటిపై...
చంద్రబింబమంటి కుంకుమతిలకాన్నై వెలగాలని!!!
చెమ్మనెన్నడు చూడని నీ కనులలో...
కనుపాపలా మెలగాలని!!!
పిల్ల తెమ్మరలకు ఎగిసే నీ కురులలో...
సిరిమల్లినై వోదిగిపోవాలని!!!

జన్మ జన్మలకు నీ మనసులోనే కొలవుండిపోవాలని....
నీ ప్రియుని ఆవేదనను అలకింపుమా....
ఓ నా ప్రియతమా !!!
నీ ప్రేమలో....
మన్ను.యస్

No comments:

Post a Comment