Saturday, February 6, 2010

అమ్మ!

అమ్మ!
సృష్టిలోని అందమైన పదం !!
సృష్టిలోని అందాన్నంతా ఒక కుప్పగా పోస్తే ...
అందులో అణువణువు నే అమ్మతో గడిపిన క్షణాలే!!

అందమంటే ఏమిటో చెప్పమంటే ...
అందానికి అమ్మ కన్నా అందమయిన పేరు వేరే ఏముంటుంది??

నే గోముగా గోరుముద్దలు తిన్నప్పుడు ...
నే ముద్దుగా తప్పటడుగులు వేస్తున్నప్పుడు ...
నా చిట్టి చేతులతో తన చెంపలను నిమురుతున్నప్పుడు ...
నా చిన్నారి పాదాలతో తన గుండెల మీద తన్తున్నప్పుడు ....
తన కళ్ళలోని ఆనందం !!!నిజమైన అందం!!!

పిల్లితో పోటిపడి పాలు తాగుతున్నప్పుడు...
తోటి పిల్లలకు దీటుగా పరీక్షలు రాస్తున్నప్పుడు...
క్లాసు కబుర్లన్నీ తనకు గుచ్చిగుచ్చి వివరిస్తున్నప్పుడు...
నాన్నపై భయాన్ని కోపంగా ప్రదర్శిస్తున్నప్పుడు...
తను నాపై కురిపించే ఆప్యాయత!!! అందం!!!

స్నేహితులతో కలిసి షికార్లలో మునిగితేలుతున్నప్పుడు...
నాన్న మందలింపును లక్ష్యపెట్టనప్పుడు...
తన బుజ్జగింపుకు సైతం లొంగనపుడు...
లోకమంత రంగుల హరివిల్లని భ్రమపడుతున్నప్పుడు ...
తన మదిలొ మెదిలే ఆందోళన !!! అందం!!!

అనుక్షణం తను నా కోసం పరితపించే...
తన అనురాగం అందం!!!
ప్రతిక్షణం తను చేసే ...
తన ఆలోచన అందం!!!
నా ఇష్టాలను తన ఇష్టాలుగా మలచుకొన్న...
తన త్యాగం అందం!!!
నాకు జన్మ నిచ్చేందుకై పంటిబిగువున పురిటినొప్పుల్ని ఓర్చిన...
తన సహనం అందం!!!

అందం !!! అందం!!!
అమ్మ ప్రేమ అందం!
అమ్మ కన్నెర్ర ఇంకా అందం!!

అమ్మ చేతి గోరుముద్ద అందం!
అమ్మ చేతిలో తిన్న దెబ్బలు ఇంకా అందం!!

అమ్మ నాపై పెంచుకున్న ఇష్టం అందం!
అమ్మ నాకోసం పడ్డ కష్టాలు చాలా చాలా అందం!!

అమ్మ అందం!!!
అమ్మతనమేంతో అందం!!!
అమ్మ మనసెంతో అందం!!!
మన్ను.యస్

No comments:

Post a Comment